లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు కోట్లాది రూపాయల అక్రమ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారన్న ఆరోపణతో నాందేడ్‌లోని భండారి ఫైనాన్స్, అదినాథ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లపై దాడులు జరిపి లెక్కల్లో చూపని రూ.170 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.140 కోట్ల నగదుతో పాటు 8 కేజీల బంగారం కూడా ఉన్నది. స్వాధీనం చేసుకున్న నగదును లెక్కపెట్టడానికి అధికారులకు 14 గంటల సమయం పట్టింది. మే 10న వందలాది మంది ఆదాయపు పన్ను శాఖ అధికారులు పలు ప్రాంతాల్లోని ఈ సంస్థల కార్యాలయాలు, వాటి యజమానుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు.వందలాది మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పన్ను ఎగవేసినట్లు భండారీ ఫైనాన్స్, ఆదినాథ్ బ్యాంకుపై ఆరోపణలున్నాయి. నాందేడ్ టౌన్‌లో ఈ స్థాయిలో ఐటీ సోదాలు జరగడం, భారీగా సొమ్ము దొరకడం ఇదే మొదటిసారి.