Russia : రష్యా సైన్యంలోకి నిరుపేద యెమెన్ యువత
ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం కిరాయి సైన్యం;
ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం రష్యా కిరాయి సైన్యాన్ని నియమించుకుంటున్నది. ఓ ప్రముఖ మీడియా సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, యెమెన్ నుంచి వందలాది మంది యువతను అక్రమ మార్గాల్లో రప్పిస్తున్నది. దీనికోసం హౌతీకి అనుబంధంగా ఉన్న ఓ కంపెనీ సేవలను వినియోగించుకుంటున్నది. భారత్, నేపాల్ యువతను ప్రలోభపెట్టినట్లుగానే వీరిని కూడా అనేక ఆశలు చూపించి తీసుకొస్తున్నది. రష్యన్ పౌరసత్వంతోపాటు అత్యధిక జీతాలు ఇస్తామని చెప్తున్నది. ఈ నేపథ్యంలో ఇరాన్, దాని మద్దతుగల ఉగ్రవాద సంస్థలతో రష్యాకు సాన్నిహిత్యం పెరుగుతున్నట్లు స్పష్టమవుతున్నది.