saudi arabia: చంపేస్తారేమోనని భయమేస్తోంది: సౌదీ యువరాజు
ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం తన ప్రాణాల మీదకు తెస్తోందని అమెరికా చట్ట సభ్యుల ముందు ఆందోళన;
పాలస్తీనా ఆందోళనలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌తో తమ దేశ సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొస్తే.. తాను హత్యకు గురయ్యే ప్రమాదముందని సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ( ఆందోళన చెందుతున్నట్లు సమాచారం! అమెరికా కాంగ్రెస్ సభ్యులతో ఆయన స్వయంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఓ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. గతంలో ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణ స్థితికి తెస్తూ ఒప్పందం కుదుర్చుకున్నాక ఈజిప్టు మాజీ అధ్యక్షుడు అన్వర్ సదాన్ హత్యకు గురైన విషయాన్ని ఆయన గుర్తుచేశారని పేర్కొంది. పాలస్తీనా దేశం ఏర్పాటుకు ఇజ్రాయెల్ సుముఖంగా లేకపోవడంపై ఎంబీఎస్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సాదత్ భద్రత విషయమై ఆనాడు అమెరికా ఏం చర్యలు తీసుకుందని ఆయన ఆరా తీసినట్లు ఆ దేశ డిజిటల్ వార్తాపత్రిక ‘పొలిటికో’ పేర్కొంది. అయితే తనకు ప్రాణభయమున్నప్పటికీ ఇజ్రాయెల్‌తో సంబంధాల విషయంలో తాను ముందుకెళ్లడానికే నిశ్చయించుకున్నట్లు సౌదీ యువరాజు స్పష్టం చేశారు.