ఏపీలో ఫైబర్‌నెట్ కేసుకు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ మేరకు గురువారం సుప్రీం కోర్టులో విచారణ రాగా జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసును డిసెంబర్ 12కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ గత నెల 12న చంద్రబాబు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై కేసులు నమోదు చేయడాన్ని కొట్టేయాలంటూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు.