తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ బలోపేతం చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ మంత్రి లోకేశ్ వెల్లడించారు. కేంద్ర ఏజెన్సీల సహకారంతో సిట్.. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరు ఉన్నారో నిగ్గు తేలుస్తుందని స్పష్టం చేశారు. నిజాలు బయటకు వస్తాయంటూ లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు