TDP: విపక్ష నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు: గౌతు శిరీష
కుటుంబ సభ్యులను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని మండిపడిన గౌతు శిరీష;
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న విపక్ష నాయకులను వైసీపీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మండిపడ్డారు. విపక్ష నేతలను వారి కుటుంబ సభ్యులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే ఇలాంటి విష సంస్కృతి మొదలైందన్నారు. పవన్‌కళ్యాణ్‌ను రాజకీయంగా విమర్శించాలనుకుంటే విమర్శించండి కానీ.. వారి ఇంట్లోని మహిళలపై సోషల్‌మీడియా పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.