Rayalaseema Projects: చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

వైసీపీ సర్కార్‌పై నిప్పులు చెరిగిన చంద్రబాబు;

Update: 2023-07-26 11:37 GMT

రాయలసీమ ప్రాజెక్టులకు వైసీపీ తీరని అన్యాయం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాయలసీమ ప్రాజెక్ట్స్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు పలువు విషయాలు వెల్లడించిన చంద్రబాబు.. జగన్ రాయలసీమ ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. నీటి కోసం దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరిగాయన్నారు. రాయలసీమ అభవృద్ధి ఎన్టీఆర్ తెచ్చిన తెలుగు గంగ ప్రాజెక్ట్‌తోనే ప్రారంభమైందన్నారు. కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం వల్ల రాష్ట్రానికి మేలు కలుగుతుందని తెలిపారు.

ప్రభుత్వ ప్రకటనల ఖర్చులు.. సలహాదారుల జీతాలతో కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేసే పరిస్థితి ఉండేదన్నారు. రాయలసీమకు.. యువతకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో ప్రాంతం.. కులం పేరు చెప్పుకుని రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సీమలో ప్రశాంతత తెచ్చింది టీడీపీనే అన్నారు. ఏపీలో తుపాను నివారించలేమని.. కానీ కరవును నివారించవచ్చని తెలిపారు.

Tags:    

Similar News