విశాఖ కలెక్టరేట్ ఎదుట 'డీఎస్సీ-98' క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. 25 ఏళ్లుగా నియామకాల కోసం ఎదురుచూస్తున్న తమకు పోస్టింగ్‌లు కొండకోనల్లోని గ్రామాలకు ఇవ్వడమేంటంటూ నిరసన చేపట్టారు. 55ఏళ్ల వయస్సు పైబడిన వారికి ఎలా బదిలిచేయాలో తెలియకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు.