Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.. రైతుబంధు నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్;
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.. రైతుబంధు నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ఈనెల 26 నుంచి జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలన్నారు.. అలాగే త్వరలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పట్టాల పంపిణీ అనంతరం పోడు రైతులకూ రైతుబంధు సాయం అందజేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.