కర్నాటకలో బీజేపీ... తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు పెద్ద తేడా లేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అక్కడ బీజేపీది 40 శాతం కమిషన్ సర్కార్ అయితే.. ఇక్కడ బీఆర్‌ఎస్‌ది 30 శాతం కమిషన్ సర్కార్ అని విమర్శించారు. బీఆర్‌ఎస్ నేతలు దండుపాళ్యం ముఠా మాదిరిగా రెచ్చిపోతున్నారని అన్నారు. శాండ్, ల్యాండ్, మైన్ అవినీతిలో ఎక్కడా చూసినా బీఆర్‌ఎస్ నేతలే ఉన్నారని అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే చరిత్ర దేశమంతా తెలిసినా.. కేసీఆర్‌కు తెలియడం లేదా అని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యులను తక్షణమే తొలగించాలన్నారు.