Philippines : ఫిలిప్పీన్స్‌లో ట్రామి తుఫాన్‌ బీభత్సం..

23 మంది మృతి;

Update: 2024-10-25 05:30 GMT

ఫిలిప్పీన్స్‌ లో తీవ్ర తుఫాన్‌ ‘ట్రామి’ బీభత్సం  సృష్టించింది. ఈ తుఫాన్‌ కారణంగా ఉత్తర ఫిలిప్పీన్స్‌లో వరదలు సంభవించాయి. చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి . ఈ ఘటనల్లో దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది కార్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. ఈ తుఫాన్‌ అర్ధరాత్రి దాటిన తర్వాత ఉత్తర ప్రావిన్స్‌లోని ఇసాబెలాలోకి ప్రవేశించినట్లు స్థానిక అధికారులను ఊటంకిస్తూ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తుఫాన్‌ ప్రభావంతో అప్రమత్తమైన అధికారులు అత్యవసర సేవలు మినహా పాఠశాలలు, కార్యాలయాలను మూసివేశారు. తుఫాను ధాటికి గంటలకు 95 – 100 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తున్నాయి.

దాదాపు 1,500 మంది పోలీసు అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ తుఫాను ధాటికి సంభవించిన ప్రమాదాల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మనీలాకు ఆగ్నేయంగా ఉన్న ఆరుప్రావిన్స్‌ బికోల్‌ ప్రాంతంలో అత్యధిక మరణాలు నమోదైనట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News