TSPSC పేపర్ లీకేజీ కేసులో కొనసాగుతోన్న అరెస్టులు
సోమవారం ఒక్కరోజే 19 మంది అరెస్ట్ చేశారు;
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజా మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఖమ్మంకు చెందిన ఆదిత్య నవీన్, గగులోతు చంటి.. సూర్యాపేటకు చెందిన ఎల్. సుమన్ అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు అరెస్టుల సంఖ్య 77కు చేరింది. సోమవారం ఒక్కరోజే 19 మంది అరెస్ట్ చేశారు. మున్సిపల్ ఏఈ పరీక్షలో 16వ ర్యాంకర్ నాగరాజును అరెస్ట్ చేశారు. ఏఈ పోల రమేష్ నుంచి 30 లక్షలకు నాగరాజు పేపర్ కొన్నాడు.