నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జంట హత్యలు కలకలం రేపాయి. జిరాయత్‌నగర్‌లో వృద్ధులైన ఇద్దరు అక్కాచెల్లెళ్లపై దుండగులు మారణాయుధాలతో దాడి చేసి చంపారు. ఒకేసారి ఇద్దరిని హత్య చేయడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతులు మగ్గిడి గంగవ్వ, మగ్గిడి రాజవ్వగా గుర్తించారు. నగల కోసం దొంగల ముఠా చంపినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. క్లూస్ టీంతో దర్యాప్తు చేపడుతున్నారు.