ఈనెల 8న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో మరోసారి ప్రోటోకాల్‌పై చర్చ మొదలైంది. అధికారిక పర్యటన కాబట్టి ప్రధానిని సీఎం రిసీవ్ చేసుకుంటారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. 2022 ఫిబ్రవరి నుంచి ప్రధాని పర్యటనలకు సీఎం దూరంగా ఉన్నారు. కేవలం ప్రోటోకాల్ కోసం ఎయిర్‌పోర్ట్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పంపిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రోటోకాల్ పాటించడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఐతే ప్రధానిని సీఎం ఆహ్వానించాల్సిన అవసరం లేదని బీఆర్‌ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.