T BJP: అర్వింద్,ఈటలకు Y కేటగిరి భద్రత
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ఈటలకు కేంద్ర హోంశాఖ Y కేటగిరి భద్రత కల్పించింది.
బీఆర్ఎస్ సర్కారును ఢికొట్టే నేతలకు కేంద్రం భారీ భద్రత కల్పిస్తోంది. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ఈటలకు కేంద్ర హోంశాఖ Y కేటగిరి భద్రత కల్పించింది. ఇప్పటికే ఈటల, అర్వింద్ ఆఫీస్, నివాసం వద్ద పరిస్థితిపై ఐబీ టీమ్, స్టేట్ ఇంటెలిజెన్స్ టీమ్ జాయింట్ రివ్యూ నిర్వహించింది. కాన్వాయ్‌లో వ్యక్తిగత వాహనంతో పాటు ఒకటి లేక రెండు వాహనాలను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అర్వింద్ ఇంటిపై కవిత అనుచరుల దాడి నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తోంది.