Uppal: ఉప్పల్‌ స్టేడియం వద్ద క్రికెటర్ల అవస్థలు

Young cricketers problems In uppal stadium;

Update: 2023-08-01 12:02 GMT

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వద్ద మూడు రోజుల పాటు HCAలో క్రికెట్‌ అండర్‌ 16 బాయ్స్‌ సెలక్షన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. సెలక్షన్‌ ప్రక్రియకు ఒక్కో రోజు ఒక్కో జిల్లాకు ఇస్తే బాగుండేదని ప్లేయర్స్‌ అంటున్నారు. ఉదయం 6 గంటలకే స్టేడియం వద్దకు క్రికెటర్లు వచ్చి పడిగాపులు కాస్తున్నారు. తమ పిల్లలు తిండి, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. HCA ఒక పద్ధతి ప్రకారం సెలక్షన్స్ నిర్వహించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. 

Tags:    

Similar News