తెలంగాణలో సైబర్ క్రైం కట్టడికి స్పెషల్ బ్యూరో
డ్రగ్స్‌ను కట్టడి చేయడంలో సమర్ధవంతంగా కృషి చేస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.;
తెలంగాణలో డ్రగ్స్, సైబర్ క్రైం కట్టడికి స్పెషల్ బ్యూరోలు ఏర్పాటు చేశారు. యాంటీ నార్కోటిక్, స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు సిద్ధమయ్యాయి. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో.. రెండు బ్యూరోలను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో చీఫ్‌గా సీవీ ఆనంద్.. స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర ఉండనున్నారు.
డ్రగ్స్‌ను కట్టడి చేయడంలో సమర్ధవంతంగా కృషి చేస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గోవా కేంద్రంగా కరుడుగట్టిన నేరస్తులను అరెస్ట్ చేశామన్నారు. డ్రగ్స్‌ను అరికట్టడంలో ధైర్యవంతులు, కమిట్‌మెంట్ విజన్ ఉన్న పోలీస్ సిబ్బంది అవసరమని పేర్కొన్నారు.
సైబర్ నేరాలు అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత సైబర్ నేరాలు పెరుగుతున్నాయని.. వివిధ రకాలుగా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. డయల్ 1930 కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఛాలెంజ్‌గా తీసుకుని సైబర్ నేరాలు అరికడతామన్నారు.