ఇటీవల జరిగిన ఆసియా కప్ 2025లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ టీమ్ T20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 250 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకుంది. ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో పాకిస్తాన్ ఉంది.పాకిస్తాన్ టీమ్ ఇప్పటివరకు 275 కంటే ఎక్కువ T20 మ్యాచ్‌లు ఆడి ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. న్యూజిలాండ్ (235), వెస్టిండీస్ (228), శ్రీలంక (212) జట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 250 మ్యాచ్‌ల్లో, భారత్ 167 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇది అత్యధిక విజయాల రికార్డులలో ఒకటి. భారత్ తన మొదటి T20 అంతర్జాతీయ మ్యాచ్‌ను 2006లో దక్షిణాఫ్రికాపై గెలిచింది. భారత్ 2007లో తొలి T20 ప్రపంచ కప్‌ను, అలాగే 2024లో రెండో T20 ప్రపంచ కప్‌ను కూడా గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో, వారు 250వ మ్యాచ్‌ను విజయంతో ముగించారు. అదే సమయంలో ఒమన్ జట్టు ఈ మ్యాచ్‌లో ఆఖరి వరకు పోరాడి ఓడిపోయింది.