ASIA CUP: హైడ్రామా నడుమ సూపర్-4కు పాకిస్థాన్

యూఏఈతో మ్యాచ్ ఆడబోమన్న పాక్.. పాక్ బెట్టు చేయడంతో మ్యాచ్ ఆలస్యం..యూఏఈపై కష్టపడి గెలిచిన పాకిస్థాన్

Update: 2025-09-18 02:00 GMT

ఆసి­యా కప్‌­లో చా­వో­రే­వో తే­ల్చు­కో­వా­ల్సిన మ్యా­చు­లో పా­కి­స్థా­న్ తడ­బ­డి ని­లి­చిం­ది. పసి­కూన యూ­ఏ­ఈ­తో జరి­గిన మ్యా­చు­లో పాక్ 41 పరు­గుల తే­డా­తో గె­లి­చిం­ది. గ్రూ­ప్‌-ఎ నుం­చి భా­ర­త్‌ ఇప్ప­టి­కే సూ­ప­ర్‌-4కు చే­ర­గా.. రెం­డో బె­ర్తు కోసం పాక్, యూ­ఏ­ఈల మధ్య పోటీ నె­ల­కొం­ది. చి­వ­రి మ్యా­చ్‌­లో ఎవరు గె­లి­స్తే వా­రి­కే సూ­ప­ర్‌-4లో చోటు. ఈ స్థి­తి­లో టా­స్‌ ఓడి మొదట బ్యా­టిం­గ్‌ చే­సిన పా­క్‌.. 9 వి­కె­ట్ల­కు 146 పరు­గు­లే చే­య­గ­లి­గిం­ది. సం­చ­లన రీ­తి­లో బౌ­లిం­గ్‌ చే­సిన జు­నై­ద్‌ సి­ద్ధి­ఖ్‌ (4/18).. ఓపె­న­ర్లు సై­మ్‌ అయూ­బ్‌ (0), సా­హి­బ్‌­జా­దా ఫర్హా­న్‌ (5)లను వరుస ఓవ­ర్ల­లో ఔట్‌ చే­య­డం­తో పా­క్‌ 9/2తో కష్టా­ల్లో పడిం­ది.

ఆదుకున్న ఫకార్ జమాన్

ఈ దశలో ఫకా­ర్‌ జమా­న్‌ (50; 36 బం­తు­ల్లో 2×4, 3×6), సల్మా­న్‌ అఘా (20) పట్టు­ద­ల­తో క్రీ­జు­లో ని­లి­చి ఇన్నిం­గ్స్‌­ను చక్క­ది­ద్దా­రు. కానీ వీ­ళ్లి­ద్ద­రూ ఔట­య్యాక పా­క్‌ మళ్లీ తడ­బ­డిం­ది. భారత సం­త­తి స్పి­న్న­ర్‌ సి­మ్ర­న్‌­జీ­త్‌ సిం­గ్‌ (3/26) ధా­టి­కి 93/6తో కష్టా­ల్లో పడిం­ది. భా­ర­త్‌­తో గత మ్యా­చ్‌­లో మా­ది­రే షహీ­న్‌ అఫ్రి­ది (29 నా­టౌ­ట్‌; 14 బం­తు­ల్లో 3×4, 2×6) ఆఖ­ర్లో చె­ల­రే­గి ఆడి జట్టు­కు గౌ­ర­వ­ప్ర­ద­మైన స్కో­రు­నం­దిం­చా­డు. ఛే­ద­న­లో యూఏఈ 17.4 ఓవ­ర్ల­లో 105 పరు­గు­ల­కే కు­ప్ప­కూ­లిం­ది. ఆరం­భం­లో­నే తడ­బ­డ్డ యూఏఈ.. 37/3కు చే­రు­కుం­ది. ఈ స్థి­తి­లో రా­హు­ల్‌ చో­ప్రా (35), ధ్రు­వ్‌ పరా­ష­ర్‌ (20) ఆ జట్టు­లో ఆశలు రే­పా­రు. కానీ ఈ భా­గ­స్వా­మ్యం వి­డి­పో­యాక యూఏఈ ని­ల­వ­లే­క­పో­యిం­ది. అబ్రా­ర్‌ అహ్మ­ద్‌ (2/13), షహీ­న్‌ అఫ్రి­ది (2/16), హా­రి­స్‌ రవూ­ఫ్‌ (2/19) ఆ జట్టు­ను దె­బ్బ తీ­శా­రు. షహీ­న్‌­కు ‘ప్లే­య­ర్‌ ఆఫ్‌ ద మ్యా­చ్‌’ అవా­ర్డు దక్కిం­ది. షా­హి­న్ షా అఫ్రి­ది మరో­సా­రి తన బ్యా­ట్‌­కు పని చె­ప్పా­డు. ఆఖరి ఓవ­ర్‌­లో అతను వరు­స­గా 6, 6, 4 బాది 18 పరు­గు­లు పిం­డు­కు­న్నా­డు. దాం­తో పా­కి­స్థా­న్ ని­ర్ణీత 20 ఓవ­ర్ల­లో 9 వి­కె­ట్ల­కు 146 పరు­గు­లు చేసి గౌరవ ప్ర­ద­మైన స్కో­ర్ అం­దు­కుం­ది. దీం­తో నా­లు­గు పా­యిం­ట్ల­తో పా­క్‌ సూ­ప­ర్‌-4కు అర్హత సా­ధిం­చ­గా, యూఏఈ ని­ష్క్ర­మిం­చిం­ది.

అనూహ్య పరిణామాలు

ఆసి­యా కప్లో భా­గం­గా భా­ర­త్ తో జరి­గిన లీగ్ మ్యా­చ్ లో ప్ర­త్య­ర్థి ఆట­గా­ళ్లు తమతో హ్యాం­డ్ షేక్ చే­య­లే­ద­ని, అం­దు­కు కా­ర­ణ­మైన రి­ఫ­రీ ఆండీ పై­క్రా­ఫ్ట్ ను తొ­ల­గిం­చా­ల­ని డి­మాం­డ్ చే­సిన పా­కి­స్తా­న్ ఐసీ­సీ వె­న­క్కి తగ్గ­క­పో­వ­డా­న్ని అవ­మా­నం­గా భా­వి­స్తోం­ది. దీం­తో ఎలా­గై­నా ని­ర­సన తె­ల­పా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. దీం­తో యూఏఈ తో పా­కి­స్తా­న్ జర­గా­ల్సిన మ్యా­చ్ కు ముం­దు అనూ­హ్య పరి­ణా­మా­లు చోటు చే­సు­కు­న్నా­యి. హ్యాం­డ్ షేక్ వి­వా­దా­ని­కి కా­ర­కు­డైన మ్యా­చ్ రి­ఫ­రీ ఆండీ పై­క్రా­ఫ్ట్ ను ప్యా­నె­ల్ నుం­చి తొ­ల­గిం­చా­ల­ని, లే­క­పో­తే తాము టో­ర్నీ నుం­చి తప్పు­కుం­టా­మ­ని పా­కి­స్తా­న్ క్రి­కె­ట్ బో­ర్డు ఇప్ప­టి­కే ప్ర­క­టిం­చిం­ది. యూ­ఏ­ఈ­తో జర­గా­ల్సిన మ్యా­చ్ కు రి­ఫ­రీ మా­ర్పు ఉం­టుం­ద­ని భా­విం­చిం­ది. అయి­తే ఐసీ­సీ నుం­చి దీ­ని­పై క్లా­రి­టీ రా­క­పో­వ­డం­తో పా­కి­స్తా­న్ క్రి­కె­ట్ బో­ర్డు బె­ది­రిం­పు­ల­కు ది­గిం­ది. మ్యా­చ్ కు పాక్ ఆట­గా­ళ్లు చి­వ­రి ని­మి­షం వరకూ హా­జ­రు కా­కుం­డా హో­ట­ల్ రూమ్ లోనే ఉం­డి­పో­యా­రు. చివరికి ఐసీసీ ఒత్తిడితో పాక్ బరిలోకి దిగింది. 

Tags:    

Similar News