IPL: మ్యాక్స్‌వెల్... ప్రదర్శన నిల్
రూ.100 కోట్ల జీతం తీసుకుంటున్న మ్యాక్సీ... బ్యాటింగ్‌లో వరుసగా విఫలం;
ఐపీఎల్ లో వేలానికి ఎప్పుడూ హాట్ కేక్ లా మారే ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈసారి మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. బ్యాటింగ్‌లో ఫెయిల్.. బౌలింగ్‌లో మోస్తరే. కానీ జీతం మాత్రం జాగ్రత్తగా గడుపుతున్నాడనే విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
4.25 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్
సీజన్ ప్రారంభంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్ కింగ్స్ రూ.4.25 కోట్లకు వేలంలో దక్కించుకుంది. మ్యాచ్ ఓనర్స్‌కి ఆశలు పెట్టుకున్నా.. మ్యాక్స్‌వెల్ మాత్రం ఈసారి బ్యాటుతో ఏం చేయలేకపోయాడు. ఆరు మ్యాచ్‌లలో ఐదు ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్స్‌వెల్.. కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 8.2 మాత్రమే.
స్ట్రైక్ రేట్ కూడా 100 లోపే!
ఒక్క హైలైట్ స్కోరు – 30 పరుగులు మాత్రమే ఈ సీజన్‌లో అతడి హయ్యెస్ట్ స్కోరు 30 మాత్రమే. మిగిలిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 11 పరుగులు చేశారు. బౌలింగ్ లోనూ అతడు నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.
విమర్శల వర్షం
గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రదర్శనపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సైమన్ డౌల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. “ఒక కోచ్‌గా ఇది బాధాకరం. అతడికి అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. కానీ ఇంకా అదే తీరు కొనసాగితే, ఒమర్జాయ్ వంటి ప్లేయర్‌ను తీసుకోవాల్సిన అవసరం వస్తుంది” అని వ్యాఖ్యానించాడు.
రూ.100 కోట్లు దాటిన జీతం!
గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు రూ.100 కోట్ల 64 లక్షలు సంపాదించాడు. మొదట ఢిల్లీ జట్టుతో, తరువాత ముంబై ఇండియన్స్, పంజాబ్, RCB వంటి జట్ల తరపున అతడు ప్రాతినిధ్యం వహించాడు. 2021లో ఆర్సీబీ అతడిని రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టులో తిరిగి చేరాడు. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. గత కొన్ని సీజన్లుగా మ్యాక్స్‌వెల్ బ్యాట్ నిశ్శబ్దంగా ఉంది. కానీ వేలంలో మాత్రం పరిగెడుతోంది. మ్యాక్స్‌వెల్ 2012లో మొదలైపోయిన ఐపీఎల్ జర్నీ లో ఇప్పటివరకు 2812 పరుగులు చేశాడు. సగటు 24 మాత్రమే. డకౌట్ అయ్యే ఆటగాళ్లలో అతడే టాప్‌లో ఉన్నాడు. అయిన జీతం మాత్రం భారీగా పెరుగుతూనే ఉంది.2024 సీజన్‌లో RCB తరపున ఆడిన మ్యాక్స్‌వెల్‌కి రూ.11 కోట్ల జీతం ఇచ్చారు.