Australian Open: ఫైనల్ కు చేరిన నోవక్

అమెరికా ఆటగాడు టామీ పాల్ పై సెమీస్ లో ఘనవిజయం

Update: 2023-01-27 12:29 GMT

ఆస్టేలియన్ ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ లో నోవక్ జెకోవిచ్ మరోసారి రాకెట్ తో మెరుపులు మెరిపించాడు. అన్ సీడెడ్ గా బరిలోకి దిగిన అమెరికా ఆటగాడు టామీ పౌల్ పై సునాయాశంగా విజయం సాధించాడు. మెల్ బోర్న్ లోని రాడ్ లావెర్ అరీనా లో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో టామీపై   7-5, 6-1, 6-2 తేడాతో విజయం సాధించాడు. టామీకి ఇది తొలి గ్రాండ్ స్లామ్ కావడం విశేషం. రెండు గంటల 20 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో జెకోవిచ్ 8గేమ్స్ మాత్రమే కోల్పోయాడు. దీంతో ఆదివారం జరగనున్న ఫైనల్స్ లో 3వ సీడెడ్ ఆటగాడైన స్టెఫానోస్ త్సిత్సిపాతో తలపడనున్నాడు. 


ఫైనల్స్ లో గెలిస్తే... జెకోవిచ్ కు ఇది పదవ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురషుల సింగిల్స్  టైటిల్ అవుతుంది. అంతేకాదు.. రెఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కు సరిసమానం కూడా అవుతాడు. మరి జెకోవిచ్ ఈ టైటిల్ ను కైవసం చేసుకుంటాడో లేదో చూడాలి. 

Tags:    

Similar News