ASIA CUP: గెలిచి నిలిచిన బంగ్లా పులులు
తప్పక గెలవాల్సిన బంగ్లా బ్యాటర్ల విధ్వంసం... అఫ్గాన్‌పై 89 పరుగుల తేడాతో గెలుపు...;
ఆసియా కప్(asia cup)లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్(Bangladesh) అదరగొట్టింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్(Afghanistan)పై ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు సూపర్–4 రేసులో నిలిచింది. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో 160 పరుగులు చేసేందుకే ఇబ్బంది పడిన బంగ్లాదేశ్ అఫ్గానిస్తాన్‌పై మాత్రం చెలరేగిపోయింది. తొలి మ్యాచ్‌లో శ్రీలకంపై చేతులెత్తేసిన బ్యాటర్లు అఫ్గనిస్థాన్‌పై చెలరేగారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్(Bangladesh) 50 ఓవర్లలో 5 వికెట్లకు 334 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్(112 : 119 బంతుల్లో 7 ఫోర్ల, మూడు సిక్స్‌లు), నజ్ముల్ హెసేన్ శాంటో(104 : 105 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో అఫ్గన్ బౌలర్లపైవిరుచుకుపడ్డారు. వీరిద్దరి విధ్వంసంతో వన్డేల్లో బంగ్లాదేశ్‌కిది మూడో అత్యధిక స్కోరు. ఓపెనర్ నయీమ్ (28), వన్‌డౌన్ బ్యాటర్ తౌహిద్ (0) నిరాశపరిచినప్పటికీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిరాజ్, నజుమల్ మూడో వికెట్‌కు 194 పరుగులు జోడించారు. కెప్టెన్ షకిబుల్ హసన్(32: 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) దంచాడు. దాంతో బంగ్లా భారీ స్కోర్ చేసింది. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, గుల్బదిన్ నయూబ్ చెరో వికెట్ తీశారు.
కష్టమైన లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్(Afghanistan) 44.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. దీంతో 89 పరుగుల తేడాతో బంగ్లా ఘన విజయం సాధించింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్ ఇబ్రహీం జర్దాన్(75), కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ(51) అర్ధ సెంచరీతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. ధాటిగా ఆడుతున్న రషీద్ ఖాన్(24)ను తస్కిన్ చివరి వికెట్‌గా పెవిలియన్ పంపడంతో అఫ్గాన్ల కథ ముగిసింది. స్టార్ పేసర్ తస్కిన్ అహ్మద్ 4 వికెట్లతో చెలరేగాడు.
మంగళవారం లాహోర్‌లో శ్రీలంక(sri lanka)తో జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ గెలిస్తే మాత్రం బంగ్లాదేశ్‌తో కలిసి ఈ మూడు జట్లు రెండు పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. మెరుగైన రన్‌రేట్ ఉన్న రెండు జట్లు ‘సూపర్–4’ దశకు అర్హత సాధిస్తాయి.