Bangladesh Woman Cricketer : బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం
మహిళా క్రికెటర్ షోహ్లీ అఖ్తర్(36)పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐదేళ్ల నిషేధాన్ని విధించింది. 2023లో సౌతాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో ఆమె మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. జమునా టీవీ అనే వార్తాసంస్థ ఆ ఏడాది ఈ ఫిక్సింగ్‌కు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్స్‌ను బయటపెట్టింది. తొలుత ఆరోపణల్ని అంగీకరించని షోహ్లీ, ఆ తర్వాత ఒప్పుకున్నారు. దీంతో ఆమెపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిషేధాన్ని విధించింది.
2023లో జరిగిన మహిళల టి20 ప్రపంచకప్ సందర్భంగా బంగ్లాదేశ్, ఆ్రస్టేలియాల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ఆమె ప్రయత్నించింది. నిజానికి 2022లోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె ఆ వరల్డ్‌కప్‌లో లేకపోయినా... టోర్నీ ఆడుతున్న బంగ్లాదేశ్ క్రికెటర్‌ను సంప్రదించి ఫిక్స్ చేయాల్సిందిగా కోరింది. తను చెప్పినట్లు ఆ బంగ్లా క్రికెటర్ హిట్ వికెట్ అయితే 2 మిలియన్ల టాకాలు (బంగ్లా కరెన్సీ) ఇస్తానని ఆశచూపింది.