BCCI: బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని మన్హాస్
భారత దేశవాళీ క్రికెట్ దిగ్గజ బ్యాట్స్మెన్లలో ఒకరైన మిథున్ మన్హాస్‌ను బీసీసీఐ కొత్త చీఫ్‌గా నియమించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మిథున్ మన్హాస్ ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా బీసీసీఐ చీఫ్‌గా గౌరవం పొందిన తొలి భారతీయ క్రికెటర్ మిథున్ మన్హాస్. ఆయనకు ముందు సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ కూడా బీసీసీఐ అధ్యక్ష పదవిని నిర్వహించారు. ఇద్దరూ భారతదేశం తరపున చాలా కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. ముంబయిలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో 37వ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. దేశవాళీలో దిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మిథున్ మన్హాస్ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం. 45 ఏళ్ల మన్హాస్ ఢిల్లీ తరఫున 157 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 130 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడాడు. అతడు 55 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు.
మిథున్ మన్హాస్ జీతం ఎంత?
మిథున్ మన్హాస్ బీసీసీఐ చీఫ్ అయ్యాడు. కానీ, అతనికి ఎలాంటి జీతం అందదు. ఆశ్చర్యపోకండి.. బీసీసీఐ అధ్యక్షుడి పదవి గౌరవప్రదమైనది. దీనికి జీతం ఉండదు. కానీ అతను వివిధ చెల్లింపులు అందుకుంటాడు. ఉదాహరణకు బీసీసీఐ అధ్యక్షుడు అధికారిక విధులను నిర్వర్తించడానికి రోజువారీ ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చులను స్వీకరిస్తాడు. నివేదికల ప్రకారం, బీసీసీఐ అధ్యక్షుడు సంవత్సరానికి రూ. 5 కోట్ల వరకు అందుకుంటాడు. ధికారిక బోర్డు సమావేశాలకు రూ. 40,000 అందుకుంటాడు. అదనంగా, అతను భారతదేశంలో అధికారిక ప్రయాణానికి రూ. 30,000 అందుకుంటాడు.