ipl: ఐపీ­ఎ­ల్ ని­ర్వ­హ­ణ­కు బీ­సీ­సీఐ సి­ద్ధం..?

ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న బీసీసీఐ;

Update: 2025-05-10 11:45 GMT

భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025 వారం రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే రీషెడ్యూల్‌లో భాగంగా సౌత్ ఇండియాలోనే మిగతా మ్యాచులను పూర్తి చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. దీనిలో భాగంగానే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ స్టేడియాలలో మ్యాచులు నిర్వహించేందుకు షార్ట్ లిస్ట్ రెడీ చేసినట్లు సమాచారం. అయితే 12 లీగ్ మ్యాచ్ లతో పాటు ప్లే ఆఫ్స్ మ్యాచ్ లను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. మొదట నిరవధిక వాయిదాగా భావించినప్పటికీ చివరకు వారం రోజులకు మాత్రమే పరిమితం చేసింది. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తలు సమసిపోతే ఐపీఎల్ ఎటువంటి ఆటంకం లేకుండా మళ్లీ మొదలయ్యే అవకాశ ఉంటుంది. . సౌత్‌లో ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లను నిర్వహించడం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో మిగిలిన మ్యాచ్ లను నిర్వహించేలా బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ ముందున్న రెండో మార్గం ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించడం. 2009లో ఐపీఎల్‌ను సౌతాఫ్రికా వేదికగా నిర్వహించారు. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సగం ఐపీఎల్‌ను యూఏఈ వేదికగా నిర్వహించారు. కరోనా కారణంగా 2020 ఐపీఎల్ ను కూడా యూఏఈ వేదికగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ను విదేశాల్లో పూర్తి చేసే మార్గం కూడా బీసీసీఐ ముందుంది. లీగ్ ను విదేశాల్లో నిర్వహించాలనుకుంటే మాత్రం జూన్ తర్వాత ఉండే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News