టీ20 వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ గాయం కారణంగా దూరమయ్యారు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో వోర్సెస్టర్‌షైర్ తరఫున ఆడుతుండగా అతను గాయపడినట్లు విండీస్ బోర్డు తెలిపింది. కానీ గాయానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేదు.ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో ఆడుతున్న లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ఒబెడ్ మెక్‌కాయ్ హోల్డర్ స్థానంలో ఎంపికయ్యాడు. . హోల్డర్ లాంటి సీనియర్ ప్లేయర్ వరల్డ్‌కప్‌కి దూరమవడం దురదృష్టకరం అని చీఫ్ సెలక్టర్ డెస్మండ్ హేన్స్ అభిప్రాయపడ్డారు.
జట్టు: రోవ్‌మన్ పావెల్ (సి), అల్జారీ జోసెఫ్ (విసి), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, షాయ్ హోప్, ఆండ్రీ రస్సెల్, రొమారియో షెపర్డ్, ఒబెడ్ మెక్‌కాయ్, అకేల్ హోసేన్, గుడాకేష్ మోతీ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్
రిజర్వ్‌లు: కైల్ మేయర్స్, మాథ్యూ ఫోర్డ్, ఫాబియన్ అలెన్, హేడెన్ వాల్ష్, ఆండ్రీ ఫ్లెచర్