పారిస్ ఒలింపిక్స్ లో చైనా తొలి స్వర్ణం కైవసం చేసుకున్నది. మిక్స్ డ్ టీమ్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో చైనాకు గోల్డ్ మెడల్ వచ్చింది. కాగా తొలి రోజు భారత షూటర్లకు నిరాశ ఎదురైంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ఎలవెనిల్ వలరివన్- సందీప్ సింగ్, రమిత- అర్జున్ బబుతా జోడీలు ఫైనల్‌కు చేరుకోలేకపోయాయి. సరబ్‌జోత్ తొమ్మిదో స్థానంలో నిలిచి త్రుటిలో ఫైనల్ అవకాశాన్ని చేజార్చుకున్నారు.పారిస్ వేదికగా ఒలింపిక్స్ 2024 పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ విశ్వక్రీడలు జులై 27 నుంచి ఆగస్టు 11 దాకా జరగనున్నాయి. ఈ క్రీడల్లో 180+ దేశాల నుంచి 10వేలకుపైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు ఆయా క్రీడాంశాల్లో పోటీ పడనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం భారత అథ్లెట్లు పలు ఈవెంట్లలో పాల్గొంటున్నారు.