Video: సిక్స్ కొడితే గ్లాస్ బద్దలే..! క్రిస్ గేల్ విధ్వంసం
క్రిస్ గేల్ విధ్వంసకర బ్యాటింగ్ ఎవరైనా ఇష్టపడతారు. ప్రత్యర్థి బౌలర్ ఎంత నిప్పులు చెరిగేబంతులు వేసినా గేల్ మాత్రం అలవొకగా సిక్స్ బాదుతాడు.;
Chris Gayle: దిబాస్ క్రిస్ గేల్ విధ్వంసకర బ్యాటింగ్ ఎవరైనా ఇష్టపడతారు. ప్రత్యర్థి బౌలర్ ఎంత నిప్పులు చెరిగేబంతులు వేసినా గేల్ మాత్రం అలవొకగా సిక్స్ బాదుతాడు. పవర్‌హిట్టింగ్ అంటే ఎంటో చూపిస్తాడు. గేల్ కొట్టిన భారీ సిక్స్‌కు స్కోర్‌కార్డ్ డిస్‌ప్లే చేసే స్ర్కీన్‌గ్లాస్ పగిలిపోయింది. తాజాగా విండీస్ వేదికగా కరీబియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్‌లో గేల్ సెంట్ కిట్స్ నెవిస్ పాట్రియోట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ కొట్టిన సుడిగాలి సిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచులో బార్బడోస్ రాయల్స్ బౌలర్ జాసన్ హోల్డర్ వేసిన 5వ ఓవర్ ఐదో బంతిని గేల్ నేరుగా స్ట్రెయిట్ సిక్స్ బాదాడు. బంతి స్కోరుబోర్డు స్క్రీన్‌కు తగిలింది. ఇంకేముంది ఇది చూసిన నెటిజన్లు ''గేల్ సిక్స్ కొడితే.. గ్లాస్ పగిలింది(Glass Breaking SIX)'' అంటూ కామెంట్లు చేశారు. అయితే గేల్ మాత్రం తక్కవ పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో సెంట్ కిట్స్ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సెంట్‌కిట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ష్రెఫాన్ రూథర్‌ఫర్డ్ 53 నాటౌట్, డ్వేన్ బ్రావో 47 నాటౌట్‌తో రాణించారు.
176 పరుగలు లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బార్బడోస్ రాయల్స్ 20 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసి 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. షై హోప్ 44 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. సెంట్ కిట్స్ బౌలింగ్‌లో షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్ చెరో రెండు వికెట్లు, ఫాబియన్ అలెన్ ఒక వికెట్ తీశాడు. ఇక ఈ మ్యాచ్‌లో గేల్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతు ఆడిన గేల్ 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.