Cristiano Ronaldo: అప్పుడే పుట్టిన బిడ్డను కోల్పోయిన రొనాల్డో.. ట్విటర్‌లో పోస్ట్..
Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.;
Cristiano Ronaldo: ఫుట్‌బాల్ వరల్డ్‌లో క్రిస్టియానో రొనాల్డో పేరు చాలా ఫేమస్. చాలామంది అప్‌కమింగ్ ఫుట్‌బాల్ ఆటగాళ్లకు తను ఇన్‌స్పిరేషన్. అలాంటి క్రిస్టియానో రొనాల్డో ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన మగబిడ్డను కోల్పోయాడు రొనాల్డో. ఈ విషయాన్ని తానే స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
క్రిస్టియానో రొనాల్డో.. జార్జినా అనే మోడల్‌తో గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నాడు. వీరిద్దరు 2017 నుండి కలిసుంటున్నారు. అయితే ఇప్పటికే వీరికి నలుగురు పిల్లలు ఉండగా. కొంతకాలం క్రితం జార్జినా మరోసారి ప్రెగ్నెంట్ అయ్యిందని, ఈసారి వారికి కవల పిల్లలు పుట్టనున్నారని రొనాల్డో స్పష్టం చేశాడు. జార్జినాకు సోమవారం డెలివరీ జరగగా.. ఆ ఇద్దరు కవలల్లో ఒకరే బ్రతికారు.
'మేము చాలా బాధతో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాం. అది ఏంటంటే మేము మా మగ బిడ్డను కోల్పోయాం. ఏ తల్లిదండ్రులకైనా ఇంతకు మించిన బాధ ఏమీ ఉండదు. మాకు పుట్టిన బేబీ గర్లే ఈ నిమిషం మాకు కాస్త సంతోషాన్ని, ధైర్యాన్ని ఇస్తోంది.' అంటూ రొనాల్డో తన ట్విటర్‌లో తెలిపాడు. ఇది తెలిసిన రొనాల్డో ఫ్యాన్స్ తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
— Cristiano Ronaldo (@Cristiano) April 18, 2022