Badminton: బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల సత్తా..
మరో వైపు మహిళల విభాగంలో పీవీ సింధు, తన 17వ స్థానాన్ని కాపాడుకుంది.;
Badminton Rankings: బ్యాడ్మింటన్ ర్యాకింగ్స్‌లో భారత ఆటగాళ్లు తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. పలు విభాగాల్లో క్రీడాకారులు ర్యాంకులను ఎగబాకి అంతర్జాతీయ స్థాయిలో భారత్ సత్తా చాటుతున్నారు. ఇటీవల జపాన్ ఓపెన్ సూపర్- 750 టోర్నీలో సత్తా చాటడంతో పురుషుల విభాగం ర్యాంకింగ్స్‌లో హెచ్.ఎస్. ప్రనోయ్, లక్ష్యసేన్‌లు వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 9, 11వ ర్యాంకులు సాధించారు. ప్రనోయ్ 1 స్థానం ఎగబాకగా, లక్ష్యసేన్ 2 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. మాజీ నంబర్ 1 ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ కూడా తన ర్యాంకు మార్చుకున్నాడు. 1 స్థానం మెరుగుపరుచుకుని 19వ స్థానంలో నిలిచాడు. మరో ఆటగాడు మిథున్ మంజునాథ్ 4 స్థానాలు ముందుకు వెళ్లి 50వ ర్యాంకు సాధించాడు.
మరో వైపు మహిళల విభాగంలో పీవీ సింధు, తన 17వ స్థానాన్ని కాపాడుకుంది. అలాగే డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీలు తమ 2వ స్థానంలోనే కొనసాగుతున్నారు. మరో డబుల్స్ జంట త్రీషా జాలీ, గాయత్రీ గోపీచంద్‌ల జోడీ కూడా 2 స్థానాలు ఎగబాకి వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానంలో నిలిచారు.