ICC RANKINGS: ఐసీసీ టీ 20 ర్యాంకులు.. అగ్రస్థానాలన్నీ మనవే

ఐసీసీ టీ 20 ర్యాంకింగ్‌ విడుదల... బౌలర్లలో టాప్‌లో వరుణ్ చక్రవర్తి... బ్యాటింగ్‌లో అగ్రస్థానంలో అభిషేక్ శర్మ

Update: 2025-09-18 04:30 GMT

ఆసి­యా కప్‌­లో వరు­స­గా రెం­డు మ్యా­చు­ల్లో దు­మ్ము­రే­పిన టీ­మ్‌­ఇం­డి­యా... ఐసీ­సీ ర్యాం­కు­ల్లో­నూ దు­మ్ము దు­లి­పిం­ది. టీ20 బ్యా­టిం­గ్‌­లో అభి­షే­క్ శర్మ, ఆల్‌­రౌం­డ­ర్ల జా­బి­తా­లో హా­ర్ది­క్‌ పాం­డ్య అగ్ర­స్థా­నం­లో ఉం­డ­గా... తా­జా­గా ఇప్పు­డు బౌ­లిం­గ్‌­లో­నూ టా­ప్‌ ర్యాం­క్‌ భారత క్రి­కె­ట­ర్‌­కే దక్కిం­ది. తా­జా­గా ఐసీ­సీ ర్యాం­కు­ల­ను ప్ర­క­టిం­చిం­ది. ఈ ఏడా­దం­తా తన బౌ­లిం­గ్‌­తో సత్తా చా­టిన వరు­ణ్‌ చక్ర­వ­ర్తి ఐసీ­సీ టీ20 టా­ప్‌ బౌ­ల­ర్‌­గా ని­లి­చా­డు. భా­ర­త్‌ తర­ఫున అగ్ర­స్థా­నం దక్కిం­చు­కు­న్న మూడో బౌ­ల­ర్‌­గా ని­లి­చా­డు. ఇప్ప­టి వరకూ జస్‌­ప్రీ­త్ బు­మ్రా, రవి బి­ష్ణో­య్ ఈ ఘనత సా­ధిం­చా­రు. ఆసి­యా కప్‌­లో వరు­స­గా రెం­డు మ్యా­చు­ల్లో­నూ నా­ణ్య­మైన ప్ర­ద­ర్శన చే­య­డం­తో వరు­ణ్‌ ర్యాం­కిం­గ్‌ మా­రి­పో­యిం­ది. మూడు స్థా­నా­లు ఎగ­బా­కి అగ్ర­స్థా­నా­ని­కి చే­రా­డు. ప్ర­స్తు­తం వరు­ణ్ ఖా­తా­లో 733 పా­యిం­ట్లు ఉన్నా­యి. అతడి తర్వాత జా­క­బ్ డఫీ (717), అకీ­ల్ హు­సే­న్ (707), ఆడమ్ జంపా (700), అది­ల్ రషీ­ద్ (677) టా­ప్‌ -5లో ఉన్నా­రు. గత కొ­ద్ది రో­జు­లు­గా జట్టు­లో స్థా­నం దక్కిం­చు­కో­లే­క­పో­తు­న్న రవి బి­ష్ణో­య్ రెం­డు ర్యాం­కు­లు ది­గ­జా­రి 8వ స్థా­నం­లో కొ­న­సా­గు­తు­న్నా­డు. గత రెం­డు టీ20ల్లో ఏడు వి­కె­ట్లు తీ­సిన కు­ల్‌­దీ­ప్‌ యా­ద­వ్ ఏకం­గా 16 స్థా­నా­ల­ను మె­రు­గు­ప­ర్చు­కు­ని 23వ ర్యాం­కు­లో­కి దూ­సు­కొ­చ్చా­డు.



అగ్రస్థానంలో అభిషేక్, హార్దిక్

ఆసి­యా కప్‌­లో తొలి రెం­డు మ్యా­చు­ల్లో­నూ దూ­కు­డు­గా ఆడిన అభి­షే­క్ శర్మ (884) తన పా­యిం­ట్ల­ను పెం­చు­కు­న్నా­డు. దక్షి­ణా­ఫ్రి­కా­పై భారీ శతకం చే­సిన ఫిల్ సా­ల్ట్ (838), దూ­కు­డు­గా ఆడిన జోస్ బట్ల­ర్ (794) తమ స్థా­నా­ల­ను మె­రు­గు­ప­ర్చు­కు­న్నా­రు. ఇక తి­ల­క్‌ వర్మ (792) నా­లు­గో ర్యాం­కు­కు పడి­పో­యా­డు. పా­క్‌­పై కీలక ఇన్నిం­గ్స్‌ ఆడిన సూ­ర్య కు­మా­ర్‌ (747) కూడా ఒక స్థా­నం ది­గ­జా­రి ఏడు­లో ని­లి­చా­డు. ఇక ఆల్‌­రౌం­డ­ర్ల జా­బి­తా­లో హా­ర్ది­క్‌ పాం­డ్య 237 పా­యిం­ట్ల­తో అగ్ర­స్థా­నం­లో కొ­న­సా­గు­తు­న్నా­డు. అక్ష­ర్ పటే­ల్ 163 పా­యిం­ట్ల­తో రెం­డు స్థా­నా­లు ఎగ­బా­కి 12వ ర్యాం­క్‌­కు, అభి­షే­క్ శర్మ 161 పా­యిం­ట్ల­తో నా­లు­గు స్థా­నా­లు దూ­సు­కొ­చ్చి 14వ ర్యాం­కు­లో చే­రా­రు. మరో­వై­పు భారత స్టా­ర్‌ క్రి­కె­ట­ర్‌ స్మృ­తీ మం­ధాన వన్డే­ల్లో నెం­బ­ర్‌­వ­న్‌ బ్యా­ట­ర్‌­గా ని­లి­చిం­ది. బ్యా­ట­ర్ల జా­బి­తా­లో మం­ధాన ఓ స్థా­నం ఎగ­బా­కి టా­ప్‌ ర్యాం­క్‌­కు చే­రిం­ది. నా­ట్‌ షి­వ­ర్‌ బ్రం­ట్‌ (ఇం­గ్లం­డ్‌) రెం­డో ర్యాం­క్‌­కు పడి­పో­యిం­ది. బౌ­ల­ర్ల­లో స్నే­హ్‌ రాణా ఐదు స్థా­నా­లు మె­రు­గై 13వ ర్యాం­క్‌­కు చే­రిం­ది. స్పి­న్న­ర్‌ సోఫీ ఎకె­ల్‌­స్టో­న్‌ నెం­బ­ర్‌­వ­న్‌ బౌ­ల­ర్‌­గా కొ­న­సా­గు­తోం­ది.

Tags:    

Similar News