ICC : పాకిస్థాన్‌పై చర్యలకు సిద్ధమైన ఐసీసీ..?

Update: 2025-09-19 06:55 GMT

యూఏఈతో జరిగిన ఆసియాకప్ మ్యాచ్ సందర్భంగా అనేక నిబంధనలను ఉల్లంఘించినందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై చర్యలు తీసుకునే అంశాన్ని ఐసీసీ పరిశీలిస్తోంది. ఈ మేరకు ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఒక ఈమెయిల్ పంపింది. ఈ వివాదానికి ప్రధాన కారణం మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ అని.. ఆయనను తొలగించాలన్న పాకిస్థాన్ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించడంతో, బుధవారం నాటి యూఏఈతో మ్యాచ్ ఒక గంట ఆలస్యంగా మొదలైంది.

ఈ వివాదాస్పద సంఘటనలో పాకిస్థాన్ జట్టు మేనేజర్, పైక్రాఫ్ట్, పాకిస్థాన్ కోచ్ హసన్, కెప్టెన్ సల్మాన్ ఆఘాల మధ్య జరిగిన సమావేశాన్ని వీడియో తీశారు. దీనిపై ఐసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటి సమావేశాలకు మీడియా మేనేజర్‌కు అనుమతి లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పారని పీసీబీ పేర్కొనడాన్ని కూడా ఐసీసీ తప్పు పట్టింది. ఈ విషయాలపై ఐసీసీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News