ICC mascots: ఆకట్టుకుంటున్న "ప్రపంచకప్‌ మస్కట్లు"

క్రికెట్‌లో వివక్ష లేదన్న సంకేతం ఇచ్చేలా మస్కట్లు... నీలి రంగుల పురుషుల మ‌స్కట్... ఎర‌పు రంగులో మ‌హిళ‌ల మ‌స్కట్...

Update: 2023-08-20 02:00 GMT

దేశంలో వన్డే ప్రపంచకప్‌ సందడి మొదలైంది. ఎక్కడ చూసినా ఈసారి ప్రపంచకప్‌ ఎవరిదనే చర్చే జరుగుతోంది. ఈసారి వ‌న్డే ప్రపంచ క‌ప్(ODI World Cup 2023)ను ఒడిసిపట్టాలన్న సంకల్పంతో అన్ని జట్లు అస్త్రశ‌స్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ మెగా టోర్నీకి ఇంకా రెండు నెల‌న్నర రోజులే స‌మ‌యం ఉండడంతో అన్ని జట్లు తుది జట్లను సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ(ICC)ప్రపంచ క‌ప్ మ‌స్కట్‌(World Cup Moscots )ల‌ను విడుద‌ల చేసింది. క్రికెట్‌లో పురుషులు, మ‌హిళ‌లు స‌మాన‌మే అనే ఉద్దేశంతో ICC ఈ మ‌స్కట్లను తెచ్చింది. గురుగ్రామ్‌లో జ‌రిగిన ప్రత్యేక కార్యక్రమంలో అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌లు య‌శ్ ధూల్(Yash Dhull), ష‌ఫాలీ వ‌ర్మ‌(Shafali Verma) స‌మ‌క్షంలో వీటిని ఆవిష్కరించారు. పురుషుల మ‌స్కట్ నీలి రంగుల , మ‌హిళ‌ల మ‌స్కట్ ఎర‌పు రంగులో ఉన్నాయి.

వ‌ర‌ల్డ్ క‌ప్ పోటీల ముందు మ‌స్కట్‌ల‌ను విడుద‌ల చేసినందుకు చాలా సంతోషంగా ఉందని సీసీ ఈవెంట్స్ అధ్యక్షుడు క్రిస్ టెట్లీ(Chris Tetley) వెల్లడించాడు. మ‌హిళ‌ల మ‌స్కట్ ద్వారా ఈ లోకంలోని స‌మానత్వం, వైవిధ్యాన్ని చాటుతున్నామని తెలిపారు. త‌ర్వాతి త‌రం అభిమానుల‌కు చేరువ‌య్యేందుకు ఈ మ‌స్కట్‌లు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయని టెట్లీ తెలిపారు. క్రికెట్ మీదున్న ప్రేమ‌ను ప్రపంచానికి చూపేందుకు ఈ రెండు మ‌స్కట్‌లు దోహదపడతాయని తెలిపారు. 

Tags:    

Similar News