TEAM INDIA: విశ్వ సమరానికి సూర్య సారథ్యంలోనే..

టీ 20 ప్రపంచకప్‌నకు జట్టు ప్రకటన... కెప్టెన్‌గా సూర్య, వైస్ కెప్టెన్‌గా అక్షర్.. వన్డే, టెస్టు సారధి గిల్‌కు మొండిచేయ్యి

Update: 2025-12-21 07:30 GMT

2026 ఫి­బ్ర­వ­రి­లో జర­గ­బో­యే ఐసీ­సీ పు­రు­షుల టీ20 వర­ల్డ్ కప్ 2026 టో­ర్నీ ఆడ­బో­యే 15 మంది సభ్యు­ల­తో కూ­డిన భారత జట్టు­ను ప్ర­క­టిం­చిం­ది బీ­సీ­సీఐ. ప్ర­స్తు­తం టీ­మిం­డి­యా టీ20 కె­ప్టె­న్‌­గా ఉన్న సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ కె­ప్టె­న్సీ­లో­నే టీ20 వర­ల్డ్ కప్ 2026 టో­ర్నీ ఆడ­నుం­ది భారత జట్టు... ఊహిం­చ­ని వి­ధం­గా ఆస్ట్రే­లి­యా­తో T20 సి­రీ­స్‌­కి వైస్ కె­ప్టె­న్‌­గా వ్య­వ­హ­రిం­చిన శు­భ్‌­మ­న్ గిల్, వర­ల్డ్ కప్‌­కి ముం­దు టీమ్ నుం­చి తప్పిం­చ­బ­డ్డా­డు. దీం­తో అత­ని­కి టీ20 వర­ల్డ్ కప్ టీ­మ్‌­లో చోటు దక్క­లే­దు. టీ20 సె­ట­ప్‌­లో గిల్ సెట్ కా­వ­డం లే­ద­ని అనేక వి­మ­ర్శ­లు రా­వ­డం, వరు­స­గా వి­ఫ­లం కా­వ­డం, ఆఖరి టీ20లో టీ­మ్‌­లో­కి వచ్చిన సంజూ శాం­స­న్ చక్క­గా రా­ణిం­చ­డం­తో అత­న్ని తప్పిం­చ­బ­డా­ని­కి బీ­సీ­సీఐ పె­ద్ద­గా కా­ర­ణా­లు అవ­స­రం రా­లే­దు.

అక్షర్ పటేల్‌కు ప్రమోషన్

అక్ష­ర్ పటే­ల్‌­కి వైస్ కె­ప్టె­న్‌­గా ప్ర­మో­ష­న్ దక్కిం­ది. అలా­గే దే­శ­వా­ళీ టో­ర్నీ­ల్లో అత్య­ద్భుత ప్ర­ద­ర్శన ఇస్తూ, సయ్య­ద్ ము­స్తా­క్ ఆలీ టీ20 టో­ర్నీ గె­లి­చిన ఇషా­న్ కి­ష­న్... రెం­డే­ళ్ల తర్వాత భారత జట్టు­లో చటు దక్కిం­చు­కు­న్నా­డు. ఐసీ­సీ టీ20 ర్యాం­కిం­గ్స్‌­లో నెం.1 పొ­జి­ష­న్‌­లో ఉన్న అభి­షే­క్ శర్మ­తో కలి­సి సంజూ శాం­స­న్ ఓపె­నిం­గ్ చే­స్తా­డు. మూడో స్థా­నం­లో తి­ల­క్ వర్మ, నా­లు­గో స్థా­నం­లో కె­ప్టె­న్ సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ బ్యా­టిం­గ్‌­కి వస్తా­రు. మి­డి­ల్ ఆర్డ­ర్‌­లో హా­ర్ధి­క్ పాం­డ్యా, శి­వ­మ్ దూబే, రిం­కూ సిం­గ్.. ఆ తర్వాత అక్ష­ర్ పటే­ల్, అర్ష్‌­దీ­ప్ సిం­గ్, హర్షి­త్ రాణా, వరు­ణ్ చక్ర­వ­ర్తి, కు­ల్దీ­ప్ యా­ద­వ్, జస్ప్రి­త్ బు­మ్రా.. ఇలా టీమ్ చూ­డ­డా­ని­కి పటి­ష్టం­గా కని­పి­స్తోం­ది.

జైస్వాల్‌కు దక్కని స్థానం

శు­భ్‌­మ­న్‌ గి­ల్‌ వైస్ కె­ప్టె­న్సీ­తో­పా­టు జట్టు­లో చోటు కో­ల్పో­యా­డు. యశ­స్వి జై­స్వా­ల్‌ ఎం­పిక కా­లే­దు. చాలా కా­లం­గా జట్టు­కు దూ­రం­గా ఉన్న ఇషా­న్‌ కి­ష­న్‌ అనూ­హ్యం­గా జట్టు­లో స్థా­నం దక్కిం­చు­కు­న్నా­డు. అతడు ఇటీ­వల ము­గి­సిన సయ్య­ద్‌ ము­స్తా­క్‌ అలీ ట్రో­ఫీ­లో రా­ణిం­చిన వి­ష­యం తె­లి­సిం­దే. దీం­తో సె­ల­క్ట­ర్లు ఇషా­న్‌ వైపు మొ­గ్గు చూ­పా­రు. ఈ మెగా టో­ర్నీ భా­ర­త్, శ్రీ­లంక వే­ది­క­గా జర­గ­నుం­ది. వర­ల్డ్‌­క­ప్‌ మ్యా­చ్‌­లు 7 ఫి­బ్ర­వ­రి 2026 నుం­చి ప్రా­రం­భం కా­ను­న్నా­యి. ర­త్‌ గ్రూ­ప్‌ స్టే­జి­లో తన తొలి మ్యా­చ్‌­ను ఫి­బ్ర­వ­రి 7న యూ­ఎ­స్‌­ఏ­తో ఆడ­నుం­ది. ఫి­బ్ర­వ­రి 12న మ్యా­చ్‌ నమీ­బి­యా­తో జర­గ­నుం­ది. ఫి­బ్ర­వ­రి 15న కొ­లం­బో­లో­ని ఆర్‌.ప్రే­మ­దాస స్టే­డి­యం వే­ది­క­గా టీ­మ్‌­ఇం­డి­యా, పా­కి­స్థా­న్‌ తల­ప­డ­ను­న్నా­యి. ఫి­బ్ర­వ­రి 18న నె­ద­ర్లాం­డ్స్‌­తో పోటీ పడ­నుం­ది. ఫి­బ్ర­వ­రి 21 నుం­చి, మా­ర్చి 1 వరకు సూ­ప­ర్‌ 8 మ్యా­చ్‌­లు జర­గ­ను­న్నా­యి. మా­ర్చి 4న మొ­ద­టి సె­మీ­ఫై­న­ల్‌, మా­ర్చి 5న రెం­డో సె­మీ­ఫై­న­ల్‌ జర­గ­నుం­ది. అలా­గే టీ20 వర­ల్డ్‌ కప్‌­న­కు ముం­దు, జన­వ­రి 11 నుం­చి న్యూ­జి­లాం­డ్‌.. భా­ర­త్‌­లో పర్య­టిం­చ­నుం­ది. ఇం­దు­లో భా­గం­గా మూడు వన్డే­లు, 5 టీ20లు జర­గ­ను­న్నా­యి. న్యూ­జి­లాం­డ్‌­తో టీ20 సి­రీ­స్‌­లో టీ20 వర­ల్డ్‌ కప్‌ కోసం ఎం­పిక చే­సిన భారత జట్టే ఆడ­నుం­ది.   

భారత జట్టు ఇదే..:

అభి­షే­క్‌ శర్మ, సూ­ర్య­కు­మా­ర్‌ (కె­ప్టె­న్‌), సం­జు­శాం­స­న్‌, తి­ల­క్‌ వర్మ, హా­ర్ది­క్‌ పాం­డ్య, శి­వ­మ్‌ దూబె, అక్ష­ర్‌ పటే­ల్‌ ( వై­స్‌ కె­ప్టె­న్‌), రిం­కు సిం­గ్‌, బు­మ్రా, అర్ష­దీ­ప్‌ సిం­గ్‌, హర్షి­త్‌ రాణా, వా­షిం­గ్ట­న్‌ సుం­ద­ర్‌, ఇషా­న్‌ కి­ష­న్‌, కు­ల్‌­దీ­ప్‌ యా­ద­వ్‌, వరు­ణ్‌ చక్ర­వ­ర్తి  

Tags:    

Similar News