IND vs AUS: నేడు భారత్-ఆస్ట్రేలియా మూడో టీ20
గెలిచి తీరాలన్న పట్టుదలతో టీమిండియా
భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. హోబర్ట్ వేదికగా మధ్యాహ్నం 1.45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సిరీస్ నిర్ణయాత్మక ఈ పోరులో టీమిండియా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునే అవకాశముంది. ఎందుకంటే.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగే అవకాశం ఉంది. దీంతో సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు కొంద అదనపు లాభం ఉండనుంది. ఇరుజట్ల మధ్య మొత్తం 32 టీ20లు జరగ్గా భారత్ 20 మ్యాచ్‌లలో విజయం సాధించింది. త్వరలో యాషెస్ సిరీస్ నేపథ్యంలో ఆసీస్ జట్టు.. టీమిండియాతో జరిగే మిగిలిన మూడు టీ20ల నుంచి హాజెల్‌వుడ్‌కు విశ్రాంతి ఇచ్చింది. మరి.. దీనిని సద్వినియోగం చేసుకొని సూర్యకుమార్ బృందం.. ఆదివారం జరిగే మూడో మ్యాచ్‌లో చెలరేగుతారేమో చూడాలి. మరోవైపు ఎడమ చేతి పేసర్ అర్ష్‌దీ్‌పకు జట్టులో చోటు కల్పించక పోవడం విమర్శలకు దారి తీస్తోంది. పేసర్లకు అనుకూలించే మెల్‌బోర్న్ పిచ్‌పై ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా ఆడడాన్ని విశ్లేషకులు తప్పుబట్టారు. మూడో మ్యాచ్ వేదిక బెల్లరీవ్ ఓవల్ పిచ్ స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుంది. దాంతో ఒక స్పిన్నర్‌ను తప్పించి పేసర్‌ను తుది జట్టులో తీసుకుంటారా లేదా అనేది చూడాలి.