IND vs PAK: భారత్-పాక్ మ్యాచుకు సిద్ధమా..?
ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ విడుదల... సెప్టెంబర్ 9న తొలి మ్యాచ్... అదే నెల 28న ఫైనల్;
ఆసియా కప్ 2025కి వేదికలు ఖరారు అయ్యాయి. యూఏఈ వేదికగా ఈ టోర్నీ నిర్వహించాలని ఇది వరకే నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వేదికలను సైతం ఖరారు చేశారు. దుబాయ్, అబుదాబీలో ఈ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో జరిగే మొత్తం 19 మ్యాచులు ఇక్కడే జరుగు తాయి. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. భారత్, పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్లో జరగనుంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకూ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా టీ 20 ఫార్మాట్లో ఆసియా కప్ టోర్నీని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యం లో ఆదివారం ఏసీసీ ఆసియా కప్ మ్యాచ్ల వేదికలను ఖరారు చేసింది. దుబాయ్, అబూదాబీలో మ్యాచ్లు జరపాలని ఏసీసీ నిర్ణయించింది. యూఏఈ కాలమానం ప్ర కారం సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకా- రం రాత్రి 730 గంటలకు) మ్యాచ్లు ప్రారంభం అవుతాయయని ఏసీసీ వెల్లడించింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 కోసం సన్నాహాలకు అనుగుణంగా ఆసియా కప్ 2025 కూడా టీ 20 ఫార్మాట్లోనే జరగనుంది.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు?
టోర్నమెంట్ అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ భారత్- పాకిస్తాన్ మధ్య జరగనుంది. గ్రూప్ స్టేజ్లో ఈ రెండు జట్లు సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడి యంలో తలపడనున్నాయి. భారత్, పాకిస్తాన్ గ్రూప్ Aలో ఉన్నాయి. ఈ గ్రూప్ లో యూఏఈ, ఒమన్ కూడా ఉన్నాయి. మరోవైపు గ్రూప్ కెలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి.
ఏ గ్రూప్లో ఎవరు?
టీమ్లను రెండు గ్రూప్ లుగా విభజించారు.
గ్రూప్ ఏ : భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్
గ్రూప్ బీ: శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, హాంకాంగ్
ఈసారి ఆసియాకప్లో భారత్ పాకిస్తాన్ జట్లు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. గ్రూప్ స్టేజ్లో ఒక మ్యాచ్, ఆ తర్వాత రెండు జట్లు సూపర్ ఫోరకు అర్హత సాధిస్తే మరో మ్యా- చ్, ఆపై ఫైనలకు చేరుకుంటే మూడో మ్యాచ్ కూడా జరగవ చ్చు. ఈ మెగా టోర్నీలో మొత్తం 19 మ్యాచ్లు జరగనున్నా- . డిగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న భారత్ ఈసారి కూడా టైటిల్ను నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది.