IND VS SL 2nd ODI: చాహర్ అదుర్స్..ఉత్కంఠ పోరులో భారత్ విజయం
IND vs SL 2nd ODI:రెండో వన్డేలో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో భారత సేన ఘన విజయం సాధించింది.;
రెండో వన్డేలో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో భారత సేన ఘన విజయం సాధించింది. చేజారిపోయినట్లు కనిపించిన మ్యాచ్‌ని దీపక్ చాహల్ అద్భుత ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. కొలంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో 276 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 193 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచినట్లు కనిపించింది. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.
8వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన దీపక్ చాహల్ అద్భుత పోరాటంతో.. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే టీమిండియాను గెలిపించాడు. చివర్లో భువనేశ్వర్ కుమార్ చక్కటి సహకారం అందించాడు. 8వ వికెట్‌కు ఈ ఇద్దరు ఆటగాళ్లు 84 బంతుల్లో 84 పరుగులు చేశారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ జట్టు 2-0తో చేజిక్కించుకుంది. ఇక నామమాత్రమైన మూడో వన్డే శుక్రవారం కొలంబో వేదికగానే జరగనుంది.