IPL: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ నిరవధిక వాయిదా

ఉద్రిక్తతల వేళ ఐపీఎల్ నిరవధిక వాయిదా త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటించే అవకాశం;

Update: 2025-05-09 07:00 GMT

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025ను BCCI నిరవధిక వాయిదా వేసింది. త్వరలో కొత్త షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. గురువారం ధర్మశాల వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ జరుగుతున్న సమయంలో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాకిస్తాన్ డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో భద్రతా కారణాలతో మ్యాచ్‌ను రద్దు చేశారు.

ఐపీఎల్ నిరవధిక వాయిదా పడడంతో రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఈ ఏడాది ఆరంభం నుంచి అదరగొడుతున్న ఆర్‌సీబీ.. ఈరోజు(శుక్రవారం) గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలని చూసింది. కానీ, ఐపీఎల్ వాయిదాతో ఆ జట్టుకు నిరాశ ఎదురైంది. ఎన్నో ఏళ్ల నుంచి కప్పు కోసం ఎదురుచూస్తున్న బెంగళూరు ఫ్యాన్స్ ఈ సారి కూడా అది కలగానే మిగిలిపోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News