ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ జరగనున్న అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు కావడం లేదని తెలుస్తోంది. జగన్ నిన్న సాయంత్రం బెంగళూరుకు బయలుదేరినట్టు సమాచారం. అయితే అమరావతి సభకు హాజరు కావాలని జగన్‌కు అధికారిక ఆహ్వానం పంపారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోతున్న ఈ కార్యక్రమానికి జగన్ దూరంగా ఉండటంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.