టీమ్ ఇండియా మేనేజర్‌గా జనసేన ఎమ్మెల్యే కుమారుడు..
జనసేన ఎమ్మెల్యే కుమారుడు పీవీఆర్ ప్రశాంత్ ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుకు మేనేజర్‌గా నియమితులయ్యారు.;
ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుకు మేనేజర్‌గా ఆంధ్రాకు చెందిన పీవీఆర్ ప్రశాంత్ నియమితులయ్యారు. ప్రశాంత్ ప్రస్తుతం ఏసీఏ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో పశ్చిమగోదావరి జిల్లా టీమ్ ప్లేయర్‌గా రాణించారు. కాగా భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు కుమారుడే ప్రశాంత్. అలాగే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు అల్లుడు కూడా. ఈ నెల 9 నుంచి 28 వరకు ఆయన టీమ్ ఇండియాతో పర్యటించనున్నారు.