ICC ఛైర్మన్‌గా జై షా ( Jay Shah ) పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్‌బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు క్రికెట్ బజ్ పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా షా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
కానీ, జై షా పోటీ చేస్తే ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ జై షా ఈ పదవిని చేపడితే అత్యంత పిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా లేదా అనే దానిపై జై షా అధికారికంగా స్పందించలేదు. మరోవైపు, ఐసీసీ వార్షిక సమావేశం జులై 19 - 22 మధ్య కొలంబోలో జరగనుంది. ఈ వార్షిక సదస్సులో ఛైర్మన్ ఎన్నికకు సంబంధించిన టైమ్‌లైన్‌ను అధికారికంగా రూపొందించాలని భావిస్తున్నారు.