JOE ROOT: చరిత్ర సృష్టించిన జో రూట్

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత;

Update: 2025-05-24 03:00 GMT

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 13000 పరుగుల మైలు రాయిని అందుకున్న బ్యాటర్‌గా రూట్ చరిత్ర సృష్టించాడు. ఈ రేర్ ఫీట్‌ను రూట్ కేవలం 153 మ్యాచ్‌లలో నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాక్వస్ కల్లిస్ పేరిట ఉండేది. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్(160), రికీ పాంటింగ్‌(162), సచిన్ టెండూల్కర్(163) ఉన్నారు. ఈ రేర్ ఫీట్‌ను రూట్ కేవలం 153 మ్యాచ్‌లలో నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాక్వస్ కల్లిస్ పేరిట ఉండేది. కల్లిస్ 159 మ్యాచ్‌ల్లో ఈ రికార్డును సాధించాడు. తాజా మ్యాచ్‌తో కల్లిస్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు.

కల్లిస్‌తో పాటు దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్(160), రికీ పాంటింగ్‌(162), సచిన్ టెండూల్కర్(163)ను అధిగమించాడు. అయితే మ్యాచ్‌ల పరంగా మాత్రం ఈ ఫీట్‌ సాధించిన జాబితాలో సచిన్(266) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో రూట్‌(279 మ్యాచ్‌లు) ఐదో స్ధానంలో ఉన్నారు. ఇక టెస్టుల్లో 13,000 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ఇంగ్లీష్ క్రికెటర్ కూడా జో రూట్‌నే కావడం గమనార్హం.  . డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వెళ్లే సమయంలో తన కళ్ల ముందు చరిత్ర తిరగరాస్తున్నట్లుగా ఉండటంతో, రూట్ మైలురాయిని చేరిన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన కెరీర్‌లో మరో విలక్షణ మైలురాయిని చేరిన రూట్, టెస్ట్ క్రికెట్ లోని సచిన్ 15,921 పరుగుల ఘనతకు ఇంకా 2,916 పరుగుల దూరంలో ఉన్నా, తన స్థిరమైన ప్రదర్శనతో ఆ రికార్డును దాటి వెళ్ళగలడని ఆశిస్తున్న అభిమానుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

Tags:    

Similar News