BGT: క్రికెట్ దిగ్గజం గవాస్కర్‌కు అవమానం
అవార్డుల వేడుకకు పిలవని నిర్వాహకులు.. మండిపడుతున్న క్రికెట్ ఫ్యాన్స్;
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా పదేళ్ల తర్వాత కైవసం చేసుకుంది. వరుసగా నాలుగు సార్లు ఈ సిరీస్‌లో ఓడిపోయిన ఆస్ట్రేలియా.. ఎట్టకేలకు ట్రోఫీని చేజిక్కించుకుంది. సిడ్నీ టెస్టులో భారత్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి.. ఈ ఫీట్ సాధించింది. అయితే మ్యాచ్ తర్వాత టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌కు అవమానం జరిగింది. 1996-97 నుంచి ఈ ట్రోఫీ గవాస్కర్.. ఆస్ట్రేలియాకు చెందిన అలన్ బోర్డర్ పేరు మీదుగా జరుగుతోంది. వారి పేర్లతోనే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీగా నామకరణం చేశారు. అయితే ఆస్ట్రేలియా సిరీస్ సాధించిన తర్వాత ట్రోఫీని అందజేసేందుకు అలెన్ బోర్డర్‌ను పిలిచిన నిర్వాహకులు.. గవాస్కర్‌ను మాత్రం పిలవలేదు.
గవాస్కర్ అసంతృప్తి
ట్రోఫీ ప్రెజెంటేషన్‌కు అక్కడే ఉన్న సునీల్ గవాస్కర్‌ను పిలవకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన సునీల్ గవాస్కర్.. తాను భారతీయుడిని కాబట్టి పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మైదానంలోనే ఉన్నానని, తన బెస్ట్ ఫ్రెండ్ అలెన్ బోర్డర్‌తో కలిసి ట్రోఫీని అందజేసి ఉంటే చాలా సంతోషించేవాడినన్నారు. ఈ సమయంలో గవాస్కర్ సిడ్నీ మైదానంలో ఉన్నప్పటికీ.. నిర్వహకులు పట్టించుకోలేదు. దీనిపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను భారతీయుడిని కాబట్టి తనకు ఇలా చేశారని పేర్కొన్నాడు. ప్రెజెంటేషన్ తర్వాత మాట్లాడిన ఆయన.. ఈ విషయంపై స్పందించారు. ప్రెజెంటేషన్ వేడుకకు వెళితే సంతోషంగా ఫీల్ అయ్యేవాడినని గవాస్కర్ అన్నాడు. ‘నేను మైదానంలోనే ఉన్నాను. ఆస్ట్రేలియాకు ట్రోఫీ ఇచ్చినా పట్టించుకోను. మెరుగైన క్రికెట్ ఆడి విజయం సాధించారు. సరే.. నేను భారతీయుడిని కాబట్టి ప్రదర్శన వేడుకకు ఆహ్వానించలేదు.” అని తెలిపారు.
సిడ్నీ టెస్టులో విజయంతో ఆస్ట్రేలియా పదేళ్ల తర్వాత బోర్డర్ -గావస్కర్ ట్రోఫీని ఆసీస్ సొంతం చేసుకుంది. చివరిసారిగా 2014/15 సీజన్‌లో ఆస్ట్రేలియా సిరీస్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత భారత్ స్వదేశంలో రెండు సార్లు.. ఆస్ట్రేలియా గడ్డపై రెండు సార్లు ట్రోఫీని దక్కించుకుంది. తాజాగా ఈ ట్రోఫీ ఆస్ట్రేలియా వద్దకు చేరుకుంది.