Magnus Carlsun : చెస్‌కు మాగ్నస్ కార్ల్‌సన్ బ్రేక్.. వరుస విజయాలతో బోర్ కొట్టిందన్న ఛాంపియన్
Magnus Karlsan : ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్లసన్‌కు వరుస విజయాలు సాధించి బోరకొట్టిందట.;
Magnus Karlsan : ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్లసన్‌కు వరుస విజయాలు సాధించి బోరకొట్టిందట. అందుకోసం తాత్కాలికంగా చెస్ కు దూరం ఉండాలనుకుంటున్నారు. 2013 నుంచి మాగ్నస్ అన్ని మ్యాచుల్లో ఘన విజయం సాధించారు. మళ్లీ మ్యాచ్‌లో విన్ అవడం వల్ల కిక్ రావడంలేదంట.
నేను ప్రేరణను పొందలేకపోతున్నా. కాబట్టి ఈ చెస్ మ్యాచ్‌లకు కొద్ది కాలం దూరంగా ఉండాలనుకుంటున్నానని అన్నాడు. చెస్ నుంచి రిటైర్ మాత్రం అవడంలేదన్నాడు. ప్రస్తుతం నేను గ్రాండ్ చెస్ టూర్ కోసం క్రొయేషియాకు వెళ్లబోతున్న.. అక్కడి నుంచి చెస్ ఒలంపియాడ్ ఆడేందుకు చెన్నై వెళ్తా అని అన్నాడు. 2013లో విశ్వనాధ్ ఆనంద్‌ను ఓడించి రికార్డు సృష్టించాడు. అప్పటి నుంచే ప్రపంచ చెస్ వీరుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.