PANT: పంత్ ను కాపాడిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ప్రేమలో విఫలం కావడంతో నిర్ణయం... ప్రేయసి మృతి;
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ కు 2022 డిసెంబర్ లో రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో అతడిని కాపాడిన రజత్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తన ప్రేయసితో కలిసి రజత్ ఆత్మాహత్య ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. యూపీలోని ముజఫర్‌నగర్‌లో గల బుచ్చా బస్తీలో నివాసం ఉండే రజత్.. ప్రేమ పెళ్లికి తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. రజత్ పరిస్థితి విషమంగా ఉండగా.. అతని ప్రేయసి చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2022 డిసెంబ ర్ లో పంత్ ఢిల్లీ నుంచి తన స్వస్థలం రూర్కీకి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పంత్ కారు పూర్తిగా కాలి బూడిదయ్యింది. అదృష్టవశాత్తు పంత్ ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలతో కారులోంచి ఎలాగోలా బయటికొచ్చి.. కొన ఊపిరితో ఉన్న పంత్‌ను రజత్.. దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
వేరే కులం కావడంతోనే..
వేరే కులం కావడంతో రజత్- పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించేలేదని తెలుస్తోంది. పెద్దల తిరస్కరణతో ఇరువురు ఆత్మహత్యకు యత్నించినట్లు రజత్ బంధువులు తెలిపారు. అయితే రజత్.. తన కుమార్తెను కిడ్నాప్ చేసి విషమిచ్చి చంపాడని మృతురాలి తల్లి ఆరోపించింది. ఫిబ్రవరి 9న వీరిద్దరూ ఆత్మహత్యకు యత్నించగా... ప్రేయసి కన్నుమూయడం విషాదాన్ని మిగిల్చింది.
రజత్ స్పందించడం వల్లే...
రజత్ అప్పటికప్పుడు అలా సేవాభావంతో స్పందించడం వల్లే పంత్ ఈ రోజు ఇలా ఉన్నాడు. లేదంటే.. తీవ్ర గాయాలతో ఉన్న అతను మరింత ఇబ్బందిపడేవాడు. వైద్యులు కూడా పంత్‌ను గోల్డెన్ అవర్‌లోనే ఆస్పత్రికి వచ్చాడంటూ పేర్కొన్నాడు. అంటే మరింత ఆలస్యమై ఉంటే ప్రాణాలకే ప్రమాదం అని అర్థం.