MESSI: హైదరాబాద్‌ను ఊపేస్తున్న మెస్సీ మేనియా

ది గోట్ ఇండియా టూర్‌కు భారీ ఏర్పాట్లు... డిసెంబర్ 13న హైదరాబాద్‌కు మెస్సీ... ప్రత్యేక విమానంలో రానున్న ది గోట్

Update: 2025-12-06 09:46 GMT

ప్ర­పం­చం మొ­త్తం మన­వై­పే చూ­డా­లి అను­కు­న్న­ప్పు­డు… అప్లై చే­యా­ల్సిన ఫా­ర్ము­లా­లు ఈ రెం­డే. సీఎం రే­వం­త్ రె­డ్డి ఈమ­ధ్య తర­చు­గా ఓ స్టే­ట్‌­మెం­ట్ ఇస్తు­న్నా­రు. తె­లం­గాణ పో­టీ­ప­డు­తు­న్న­ది పక్క రా­ష్ట్రా­ల­తో కాదు ఇతర దే­శా­ల­తో అని. గ్లో­బ­ల్ కాం­పి­టి­ష­న్‌­లో తె­లం­గా­ణ­ను పె­ట్టా­ల­నే­దే సీఎం రే­వం­త్ రె­డ్డి టా­ర్గె­ట్ కూడా. సో, గ్లో­బ­ల్ లె­వె­ల్‌­లో తె­లం­గా­ణ­కు గు­ర్తిం­పు రా­వా­లం­టే.. ఆట కూడా ఇం­ట­ర్నే­ష­న­ల్ పర్స­న్స్‌­తో­నే ఉం­డా­ల­నే సం­కే­తా­లు పం­పు­తు­న్నా­రు. పైగా ‘తె­లం­గాణ రై­జిం­గ్-2047’ వి­జ­న్ డా­క్యు­మెం­ట్ రి­లీ­జ్ చే­య­డం కోసం గ్లో­బ­ల్ సమి­ట్ పె­డు­తోం­ది తె­లం­గాణ ప్ర­భు­త్వం. అం­దు­లో స్పో­ర్ట్స్‌­కు స్పె­ష­ల్ ఇం­పా­ర్టె­న్స్ ఉంది. దా­న్ని అడ్వ­ర్టై­జ్ చే­య­డం కూడా ఒక గోల్.. హై­ద­రా­బా­ద్‌­కు బి­ల్‌­గే­ట్స్ వచ్చాక.. సిటీ ఫేమ్ మరో రేం­జ్‌­ని టచ్ చే­సిం­ది. అం­త­టి బిల్ క్లిం­ట­నే హై­ద­రా­బా­ద్‌ లో అడు­గు పె­ట్టిన తరు­వాత ఇం­ట­ర్నే­ష­న­ల్ మ్యా­గ­జై­న్స్ అండ్ మీ­డి­యా­లో హై­ద­రా­బా­ద్‌­కు గొ­ప్ప బ్రాం­డిం­గ్ జరి­గిం­ది. టె­క్నా­ల­జీ అని, ఏఐ అని, సో­ష­ల్ మీ­డి­యా అని.. ఆ రూ­ట్‌­లో ఎంత ప్ర­య­త్నిం­చి­నా రాని బ్రాం­డిం­గ్.. కొ­న్ని­సా­ర్లు ఒక్క పర్స­న్‌­తో వచ్చే­స్తుం­ది. అప్ప­టి దాకా జర­గ­ని మా­ర్కె­టిం­గ్ ఆ ఒక్క ఈవెం­ట్‌­తో జరి­గి­పో­తుం­ది. బట్.. దా­న్ని ఒడి­సి­ప­ట్టి, ప్లా­న్ చే­య­డం­లో­నే ఎవరి కె­పా­సి­టీ ఎంతో తే­లు­తుం­ది. ఈ వి­ష­యం­లో తె­లం­గాణ ప్ర­భు­త్వా­ని­ది సూ­ప­ర్ సక్సె­స్. ఇప్పు­డు­న్న ఫు­ట్‌­బా­ల్ ఆట­గా­ళ్ల­లో మె­స్సీ తరు­వా­త­నే ఎవ­రై­నా. అలాం­టి వ్య­క్తి­ని హై­ద­రా­బా­ద్‌­కు రప్పి­స్తోం­ది. ఇం­త­కీ మె­స్సీ...

ఈ నెల 12వ తేదీ రాత్రికి మెస్సీ కోల్‌కతాకు చేరుకుంటాడు. 13వ తేదీ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ‘ది గోట్‌’ హైదరాబాద్‌కు చేరుకుంటాడు. అతడితో పాటు 200 మందితో కూడిన జంబో సిబ్బంది బృందం హైదరాబాద్‌కు వస్తుంది. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించనుంది. మె­స్సీ వసతి వి­వ­రా­ల­ను అధి­కా­రు­లు గో­ప్యం­గా ఉం­చా­రు. ఆరో­జు సా­యం­త్రం 5.30 నుం­చి 6.15 గంటల వరకు ‘మీ­ట్‌ అం­డ్‌ గ్రీ­ట్‌’ కా­ర్య­క్ర­మం­లో మె­స్సీ పా­ల్గొం­టా­డు. రా­త్రి 7 నుం­చి 9 వరకు ఉప్ప­ల్‌ స్టే­డి­యం­లో ‘మె­స్సీ మాయ’ అల­రిం­చ­నుం­ది. తొ­లుత సె­ల­బ్రి­టీ­ల­తో ఎగ్జి­బి­ష­న్‌ మ్యా­చ్‌ ని­ర్వ­హి­స్తా­రు. ఒక జట్టు­కు రే­వం­త్‌­రె­డ్డి..మరో జట్టు­కు మె­స్సీ సా­ర­థ్యం వహి­స్తా­రు. అనం­త­రం యువ ప్ర­తి­భా­వం­తు­ల­తో మె­స్సీ మా­స్ట­ర్‌ క్లా­స్‌ కా­ర్య­క్ర­మం ఉం­టుం­ది. ఆ తర్వాత పె­నా­ల్టీ షూ­టౌ­ట్‌ ని­ర్వ­హి­స్తా­రు. చి­వ­ర్లో మ్యూ­జి­క­ల్‌ కా­న్స­ర్ట్‌ జరు­గు­తుం­ది. ఆరో­జు రా­త్రి మె­స్సీ నగ­రం­లో­నే బస చేసి మర్నా­డు ఉదయం ప్ర­త్యేక వి­మా­నం­లో ముం­బ­యి­కి బయ­ల్దే­ర­తా­డు. ‘ది గో­ట్‌ ఇం­డి­యా టూ­ర్‌’ ప్ర­స్తు­తం ప్ర­పంచ క్రీ­డా­భి­మా­ను­ల్ని ఉర్రూ­త­లూ­గి­స్తు­న్న ట్యా­గ్‌­లై­న్‌. హై­ద­రా­బా­ద్‌­లో 13వ తే­దీన ఫు­ట్‌­బా­ల్‌ ది­గ్గ­జం లి­యో­నె­ల్‌ మె­స్సీ ఆటను ప్ర­త్య­క్షం­గా వీ­క్షిం­చేం­దు­కు ఫు­ట్‌­బా­ల్‌ అభి­మా­ను­లు సహా సినీ, రా­జ­కీయ, క్రీ­డా ప్ర­ము­ఖు­లు సైతం అమి­తా­స­క్తి కన­బ­రు­స్తు­న్నా­రు.

Tags:    

Similar News