Djokovic: టెన్నిస్ స్టార్ జకొవిచ్ పై విష ప్రయోగం..!

సంచలన ఆరోపణలు చేసిన నొవాక్ జకోవిచ్... 2022లో జరిగిందని వెల్లడి;

Update: 2025-01-11 02:30 GMT

టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ సంచలన ఆరోపణలు చేశాడు. తనపై విషప్రయోగం చేశారని, ఓ హోటల్ యాజమాన్యంపై సంచలన కామెంట్స్ చేశాడు. తాజాగా ఆస్ట్రేలియాన్ ఓపెన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు తనను అదుపులోకి తీసుకున్నప్పుడు తన మీద విషప్రయోగం జరిగిందని జొకోవిచ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్-2022కి ముందు తప్పుడు సమాచారం అందించినందుకు జొకోవిచ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతడి వీసాను రద్దు చేశారు. అతను చట్టపరమైన చర్యల సమయంలో మెల్‌బోర్న్‌లోని ఒక హోటల్‌లో బస చేశాడు. అప్పుడే తనకు విషప్రయోగం జరిగిందని జొకోవిచ్ పేర్కొన్నాడు.

అసలు ఏం జరిగిందంటే..?

2022 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేNovak Djokovic Avoids Questions On “Poisoning” Claim, Focuses On Tennis వారు కచ్చితంగా కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని నిబంధనలను పెట్టారు. కానీ జకోవిచ్ దానికి అంగీకరించలేదు. వ్యాక్సిన్ వేసుకోకుండానే మ్యాచులు ఆడేందుకు ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లోకి అడుగుపెట్టాడు. కానీ అక్కడ జోకోవిచ్‌కు స్థానిక అధికారుల నుంచి చుక్కెదురైంది. కొవిడ్ వ్యాక్సినేషన్ ఉన్న వాళ్లనే తమ దేశంలోకి అనుమతిస్తుండటం వల్ల ఆ వ్యాక్సిన్ వేసుకుని జోకోవిచ్ ను హోటల్ లో నిర్బంధించారు. కానీ అతడు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. అయినా కూడా జకోవిచ్ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల, ఆ ఏడాది ఆస్ట్రేలియా అతడిని బహిష్కరించింది. జోకోవిచ్ వీసాను రద్దు చేసి, అతన్ని ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడకుండా వెనక్కి పంపించింది. ఆ సమయంలోనే తనను క్వారంటైన్ లో ఉంచిన హోటల్ వారు, తనకు అందించిన భోజనంలో మెర్క్యూరీ లాంటి ప్రమాదకర రసాయనాలు కలిపారని జకోవిచ్ తాజాగా ఆరోపణలు చేశాడు.

తేడాగా అనిపించడంతో..

ఆస్ట్రేలియా నుంచి ఇంటికి వచ్చాక తన శరీరంలో ఏదో తేడాగా ఉన్నట్లు అనుమానం వచ్చి ఆస్పత్రికి వెళ్లినట్లు గుర్తుచేసుకున్నాడు జకోవిచ్. రిపోర్ట్స్ లో పెద్ద మొత్తంలో మెర్క్యూరీ ఉన్నట్లు తేలిందని పేర్కొన్నాడు. ఆ తర్వాత చికిత్స తీసుకుని అందులో నుంచి బయటపడ్డానని తెలిపాడు. 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం మళ్లీ ఆస్ట్రేలియాకు వచ్చాడు జోకోవిచ్. ఇప్పుడీ టోర్నీలో గెలిచి తన ఖాతాలో మరో గ్రాండ్ స్లామ్ వేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటివరకు 24 గ్రాండ్ స్లామ్ లు సాధించిన అతడు, ఇప్పుడు 25వ టైటిల్ పై కన్నేశాడు. 

Tags:    

Similar News