Sun Risers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఆసీస్ సారథి!
గతేడాది పరాభవంతో జట్టులో పలుమార్పులు చేసిన సన్‌రైజర్స్;
గత ఐపీఎల్ సీజన్‌లో దారుణ ఆటతీరుతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ప్రక్షాళన ప్రారంభించింది. సారథి మార్కరమ్‌కు ఉద్వాసన పలికి అతడి స్థానంలో ఆస్ట్రేలియాకు వన్డే ప్రపంచకప్ అందించిపెట్టిన సారథి పాట్ కమిన్స్‌కు పగ్గాలు అప్పగించనున్నట్టు తెలిసింది. గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో కమిన్స్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం ఏకంగా రూ. 20.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అది రెండో అత్యధిక ధర. అతడికి కెప్టెన్సీ అప్పగించేందుకే అంత ధర పెట్టి అతడిని కొనుగోలు చేసినట్టు తెలిసింది.
గత సీజన్‌లో మార్కరమ్ సారథ్యంలోని జట్టు 14 మ్యాచుల్లో నాలుగు విజయాలు మాత్రమే సాధించింది జాబితాలో కింది నుంచి తొలి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో జట్టులో పలు మార్పులు చేసిన సన్‌రైజర్స్ జట్టు.. ప్రధాన కోచ్ బ్రయాన్ లారాను తప్పించి అతడి స్థానంలో ఆస్ట్రేలియా జట్టు సహాయక కోచ్ డేనియల్ వెటోరీని నియమించింది.
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌కు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ జట్టుకు కెప్టెన్సీగా ఉన్న మార్కరమ్ వరుసగా రెండోసారి కూడా జట్టును విజేతగా నిలిపాడు. అయినప్పటికీ ఐపీఎల్‌లో మాత్రం జట్టుకు కష్టాలు తప్పడం లేదు.
తొలి మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ షెడ్యూల్‌లో సన్‌రైజర్స్ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. మార్చి 27న ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్.. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢీకొననుంది. 15 రోజులు ప్రకటించిన తొలి షెడ్యూల్‌లో హైదరాబాద్ నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మార్చి 23న కేకేఆర్‌తో తొలి మ్యాచ్ ఆడే సన్ రైజర్స్.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. రెండు మ్యాచ్‌లు సొంత గ్రౌండ్‌లో ఆడనున్న హైదరాబాద్.. మిగతా రెండింటినీ కోల్‌కతా, అహ్మదాబాద్‌లో ఆడాల్సి ఉంది. మార్చి 23వ తేదీన కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్ – కోల్‌కతా మార్చి 27వ తేదీన హైదరాబాద్ వర్సెస్ ముంబై మార్చి 31న గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ – అహ్మదాబాద్ ఏప్రిల్ 5న హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్‌లు జరగనున్నాయి.