ఒలింపిక్స్‌లో ఆడాలని ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు. వచ్చే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పిస్తూ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసీస్ తరఫున ఒలింపిక్స్‌లో ఆడాలనే కోరిక ఉందని కమిన్స్ తెలిపాడు. ‘ఒలింపిక్స్ గేమ్స్‌ను చూసినప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది. అందులో భాగం కావాలని ఉంది. వచ్చే ఒలింపిక్స్ కల్లా నాకు 35 ఏళ్లు వస్తాయి. ఆసీస్ తరఫున ఆడతాననే అనుకుంటున్నా. లాస్‌ఏంజెలెస్ ఒలింపిక్స్ దగ్గరపడినప్పుడు సన్నాహాలు ప్రారంభిస్తాం. ఆ సమయానికి ఫిట్‌గా, ఫామ్‌లో ఉండే వారికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తా’ అని కమిన్స్ అన్నాడు.