నీరజ్ విజయం ఎప్పటికి మరువలేనిది : ప్రధాని మోదీ
ఒలింపిక్స్‌లో భారత స్వర్ణ పతక ఆశలను యువకెరటం నీరజ్ చోప్రా నిలబెట్టాడు. జావెలిన్ త్రో విభాగంలో అత్యధిక దూరం విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు.;
ఒలింపిక్స్‌లో భారత స్వర్ణ పతక ఆశలను యువకెరటం నీరజ్ చోప్రా నిలబెట్టాడు. జావెలిన్ త్రో విభాగంలో అత్యధిక దూరం విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు. భారత్‌కు స్వర్ణం తెచ్చిన రెండో ఆటగాడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా స్వర్ణం సాధించగా.. రెండో ఆటగాడిగా నీరజ్ చోప్రా నిలిచాడు. ఇక స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాకు దేశవ్యాప్తంగా అభినందలు వెల్లువెత్తుతున్నాయి. నీరజ్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసలు కురిపించారు. నీరజ్ విజయం ఎప్పటికి మరువలేనిదని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. నీరజ్ అసమాన పోరాట పటిమ ప్రదర్శించాడని కొనియాడారు. మొత్తానికి ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్.. 130 కోట్లకు పైగా భారత ప్రజల ఆశలను నెరవేర్చాడు. ఇన్ని కోట్ల జనాభా ఉన్న దేశానికి ఒలింపిక్‌లో ఒక్క స్వర్ణం కూడా రాలేదని నిరాశలో ఉన్న భారతీయుల హృదయాలను గర్వంతో ఉంప్పొంగేలా చేశాడు.